పేదల సొంతింటి కల నెరవేరుస్తాం : డా.పర్ణికారెడ్డి

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం : డా.పర్ణికారెడ్డి
  • పేట ఎమ్మెల్యే డా.పర్ణికారెడ్డి

మరికల్, వెలుగు:  జాగ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే డా.పర్ణికారెడ్డి తెలిపారు. సోమవారం మరికల్​లో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణం కోసం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 75 గజాల పైబడి స్థలం,   ఉండాలని నిబంధనల ప్రకారం నిర్మాణం చేసుకుంటే దశల వారీగా బిల్లులు మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. 

నేటి నుంచి పల్లెల్లో గ్రామసభలు ఉంటాయని,  అందులో నాలుగు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, ప్రతి ఒక్కరూ గ్రామసభలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  మార్కెట్​ కమిటి చైర్మన్​ సదాశివారెడ్డి, ఎంపీడీవో కొండన్న, తహసీల్దార్​ అనిల్​కుమార్​, వెంకట్రామారెడ్డి, స్థానిక నాయకులు సూర్యమోహన్​రెడ్డి, బి.వీరణ్ణ, గొల్ల కృష్ణయ్య, వినితమ్మ, హరీశ్​​, ఎల్​.రాములు, రామకృష్ణారెడ్డి, పి.రామకృష్ణతో పాటు మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్​ పార్టీ నాయకులు పాల్గొన్నారు.