రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయండి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయండి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బస్టాండ్ సెంటర్ లోని గణేశ్​ టెంపుల్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్డుపై మురుగు నీరు పారకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 

వ్యాపారుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రహదారి విస్తీర్ణ పనులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని చెప్పారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ రోడ్డు ప్రక్కనే ఉన్న ఓ టీ స్టాల్  వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వారందరికీ తానే స్వయంగా బిస్కెట్లు, చాయ్​ ఇప్పించి, తాను చాయ్​ తాగుతూ వారితో స్థానిక సమస్యలపై చర్చించారు.