దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం : కడియం శ్రీహరి

దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం : కడియం శ్రీహరి
  • ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

రఘునాథపల్లి , వెలుగు: దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా  లింగాల ఘనపురం, రఘునాథపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి  పంపిణీ చేశారు.  109 మందికి రూ.  కోటి తొమ్మిది లక్షల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు, 32 మందికి  సీఎంఆర్ఎఫ్  రూ. 11 లక్షలు అందజేశారు.   

అనంతరం ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ..    ఆశ్వరావుపల్లి కుడి కాలువ పనులను జనవరి 8లోగా పూర్తి చేసి యాసంగి పంటకు సాగునీరు అందిస్తామన్నారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్డీవో గోపిరాం,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  నరసింహం, ఏఎంసీ  వైస్ చైర్మన్ శివ కుమార్, తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.