కల్వకుర్తి, వెలుగు: పట్టణంలో రూ.4.80 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంఎఫ్ టీ ఫండ్స్ నుంచి రూ.89 లక్షలు, ఎస్డీఎఫ్ ఫండ్స్ నుంచి రూ.1.15 కోట్లు, జనరల్ ఫండ్ నుంచి రూ.2.80 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
వివిధ కులాలకు చెందిన కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, యూజీడీ పనులను ప్రారంభించినట్లు చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, నాయకులు ఆనంద్ కుమార్, శ్రీశైలం, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.