బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, వెలుగు :  తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో వెలిసిన  లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ను సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఆలయ కమిటీ సభ్యులు ఫిబ్రవరి 7, 8, 9 న  నిర్వహించే బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రాన్ని అందించి ఆహ్వానించారు .  

ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి , టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కి వారు ఆహ్వాన పత్రాల అందించి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమాలలో పీఏసీఎస్​  చైర్మన్ కేశవరెడ్డి, నాయకులు బాలాజీ సింగ్, ప్రభాకర్ రెడ్డి, అంజయ్య, వెంకటరెడ్డి, అజీమ్, శంకర్ నాయక్, రవి నాయక్, ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తి, అశోక్ బాబు, నర్సింలు, అజీజ్  పాల్గొన్నారు.