కల్యాణ లక్ష్మి చెక్కులు ఆపొద్దు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి

మునుగోడు, చండూరు, వెలుగు : తన కోసం కల్యాణ లక్ష్మి చెక్కులను ఆపొద్దని, చెక్కులు రిలీజైన వెంటనే గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు ఇవ్వాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మునుగోడులోని క్యాంపు ఆఫీస్‌‌లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కోసం ఎవరికీ నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, పెళ్లి కార్డు, కాస్ట్ సర్టిఫికెట్‌‌తో అప్లై చేసుకుంటే సరిపోతుందన్నారు.  అనంతరం రెవెన్యూ అధికారులు,  సిబ్బంది  ఎమ్మెల్యేను కలిసి తహసీల్దార్‌‌‌‌ కార్యాలయానికి కొత్త భవనం  నిర్మించాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  ప్రభుత్వ భూములకు కబ్జాకు గురవుతున్నాయని తన దృష్టికి వచ్చిందని, వాటిని కాపాడాలని ఆదేశించారు.  తర్వాత లంబాడీల ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ లచ్చిరామ్ నాయక్‌‌, ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి భిక్షపతి ఎమ్మెల్యేను సేవలాల్ మహారాజ్ జయంతి రోజైన ఫిబ్రవరి 15 న సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.  అనంతరం బ్రెయిన్‌‌ సమస్యతో బాధపడుతున్న చండూరు మున్సిపాలిటీకి చెందిన మేడిపల్లి లక్ష్మణ్ కొడుకు గౌతమ్‌‌కు  ద్వారా 2.5 లక్షల ఎల్‌‌వోసీ అందించారు

ఆపరేషన్ కు ఖర్చు ఎక్కువైనా భరిస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నేతలు జాల వెంకన్న యాదవ్ ,   సంతోష సైదులు , పగిళ్ల బిక్షం,  వెంకన్న,  మహేశ్వరి,  పద్మ,  లింగయ్య  ,  భాస్కర్ ,  వేణు,  మల్లేశ్,  మారయ్య, ముజ్జు,  మల్లేశ్, వెంకన్న,  వెంకటేశ్వర్లు,  రాజు,  సాయి, శంకర్ పాల్గొన్నారు.