పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తన ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి గాంధీ దాడికి వస్తే ఎందుకు అడ్డుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరుండి పోలీసులే తనపై దాడి చేయించారని మండిపడ్డారు. తనపై దాడి జరుగుతుంటే చూస్తూ ఉండిపోయారన్నారు. తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేకపోయారన్నారు. ప్రభుత్వం, పోలీస్వ్యవస్థ విఫలమైందన్నారు. తెలంగాణ బిడ్డలం..ఆంధ్రావాళ్లు దాడి చేస్తే ఊరుకుంటామా? తెలంగాణ పవరేంటో రేపు(సెప్టెంబర్ 13) చూపిస్తామని సవాల్ చేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. తనను ప్రీ ప్లాన్ గా హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.
భారీ కాన్వాయ్ తో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు బద్దలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కోడిగుడ్లు, టమోటాలతో కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు. . దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు కుర్చీలతో కొట్టుకున్నారు. రణరంగంగా మారింది. కౌశిక్ రెడ్డి బయటకు రావాలంటూ కాంగ్రెస్ కార్యర్తలు ఇంటి ముందు బైఠాయించారు.
మరో వైపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన ఇంటి దగ్గర విడిచిపెట్టారు.