బాధిత కుటుంబాలకు పరామర్శ

పర్వతగిరి, వెలుగు: వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లి, కొంకపాక, సోమ్లాతండాలో ఇటీవల మృతి చెందిన బాధ ఉప్పలయ్య, నాంపల్లి రాజయ్య, నాంపల్లి దూడయ్య, గంధం సాయిలు గౌడ్, భూక్యా వెంకన్న నాయక్ కుటుంబాలను, సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు పరామర్శించారు.

కాగా, గోపనపెల్లికి చెందిన  లింగాల లక్ష్మీనారాయణ, నాంపల్లి లచమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, మండలాధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.