వాటర్​ రిజర్వాయర్లతో నీటి సమస్యకు పరిష్కారం : మహిపాల్ రెడ్డి

వాటర్​ రిజర్వాయర్లతో నీటి సమస్యకు పరిష్కారం : మహిపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం (అమీన్​పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపాలిటీలో వాటర్​ రిజర్వాయర్ల ఏర్పాటుతో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ. 6 కోట్ల 82 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం లాలాబాయి కాలనీలో కొత్తగా నిర్మించిన ఐదు వాటర్ రిజర్వాయర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్ధ కాలంగా స్థానిక కాలనీ ప్రజలు తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారన్నారు. 

కొత్తగా నిర్మించిన రిజర్వాయర్లతో ఇకపై ప్రతి కాలనీకి తాగునీటిని అందిస్తామని చెప్పారు. అన్ని కాలనీలలో జియో ట్యాగింగ్ చేసి ఇంటింటికీ వాటర్​ పైప్​లైన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో అందరూ కలిసి రావాలని, పదవి దిగిపోయినా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కౌన్సిలర్లకు సూచించారు. మున్సిపల్​ చైర్మన్​ పాండురంగా రెడ్డి, వైస్​ చైర్మన్​నర్సింహా గౌడ్​, కమిషనర్​జ్యోతిరెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్​ మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు.