
గోదావరిఖని, వెలుగు: ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సంస్థల అధికారులకు సూచించారు. సోమవారం ఎన్టీపీసీ మిలీనీయమ్ హాల్‌లో ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థల ఏర్పాటు సమయంలో వేల ఎకరాల భూములను త్యాగం చేశారని, కానీ ఆయా ప్రభావిత ప్రాంతాలలో మాత్రం అభివృద్ధి పనులు చేయడంలో మేనేజ్‌మెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.
ఎన్టీపీసీ కోసం భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కుందనపల్లి గ్రామాన్ని కాలుష్యం నుంచి విముక్తి కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ.25 లక్షలతో జనగామ గ్రామంలో నిర్మించిన దోభీఘాట్, వాటర్‌ట్యాంక్, రెస్ట్షెల్టర్, బోర్‌వెల్, ఐకేపి సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మీటింగ్‌లో ఆర్డీవో గంగయ్య, ఎన్టీపీసీ హెచ్ఆర్ జీఎం సిక్ధర్, ఆర్ఎఫ్సీఎల్ హెచ్ఆర్ హెడ్ సోమనాథ్, రామగుండం ఇన్‌చార్జి తహసీల్దార్ ఈశ్వర్, ఆఫీసర్లు పాల్గొన్నారు.