
- ఆడపిల్ల పసుపు, కుంకుమలు గుంజుకున్న నీచపు బతుకు నీది
- ప్రతిపక్షాలు నా కబ్జాలు నిరూపిస్తే ప్రాణత్యాగం చేస్తా
- వేరే పార్టీ నుంచి వస్తే కుక్కలంటావా?
చేర్యాల, వెలుగు: ఆడపిల్ల పసుపు, కుంకుమలను గుంజుకునే నీచపు బతుకు బతుకుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నియ్యత్లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డా కామెంట్స్చేశారు. సోమవారం జనగామ జిల్లా చేర్యాలలోని వీరభద్ర గార్డెన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ స్థానిక నాయకులను ప్రభావితం చేసేందుకు పల్లా డబ్బు సంచులతో వస్తున్నాడని, ఆయనకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.
వేరే పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలు, నక్కలతో పోల్చిన పల్లా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పల్లా అక్క జయప్రదను మోసం చేయడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని, ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా సొంత పైసలు పెట్టి భోజనాలు పెట్టి నిన్ను గెలిపించిన. కానీ 70 కోట్లు ఖర్చు పెట్టిన అని చెప్పినవ్..ఖబడ్దార్పల్లా...నీకు ప్రజలే బుద్ది చెప్తరు’ అని హెచ్చరించారు.
తాను ఏనాడూ భూ కబ్జాలకు పాల్పడలేదని, నిరూపిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రతిపక్షాలను సవాల్‌విసిరారు. జనగామలో తనకే సీటు వస్తుందని గెలవడం కూడా ఖాయమన్నారు. ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్, మార్కెట్ చైర్మన్ ఎస్. మల్లేశం గౌడ్, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, పి. వెంకట్‌రెడ్డి, యం. బాలనర్సయ్య, కౌన్సిలర్లు చంటి, నరేందర్, సతీష్ గౌడ్, పి. ఎల్లారెడ్డి, ఎ. మల్లేశం, యం. నాగేశ్వర్రావు, యం. మల్లేశం, మంద యాదగిరి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.