మోతె (మునగాల), వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సూచించారు. బుధవారం మోతె మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మద్ధతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.
.చివరి గింజ కొరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో ధాన్యం కాంటాలు వేయడం, గన్ని బ్యాగుల కొరత రాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంఘమిత్ర, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.