కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం : ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం : ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్
  • రైతులకు బాసటగా నిలిచేందుకే : ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ 

భైంసా, వెలుగు:   రైతన్నకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు.  శనివారం భైంసాలోని గాంధీ గంజ్​లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా  ముథోల్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు.  కందులు క్వింటాలుకి రూ.7,550 ఇస్తున్నారని  రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

ఐక్యత తోనే గ్రామాలాభివృద్ధి 

కుంటాల:  రూ.99 లక్షలతో నిర్మించే విట్టపూర్, ఓల బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పవార్ రామారావు ప్రారంభించారు.  కుంటాల మండల కేంద్రంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించే సీ సీ రోడ్డు, గజ్జలమ్మ ఆలయ ప్రాంగణంలో రూ.5 లక్షల తో నిర్మించే రీడింగ్ రూమ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. 

అంతకు ముందు గజ్జలమ్మను దర్శించుకున్నారు.  కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ జుట్టు అశోక్, నాయకులు భోజరాం పటేల్, ఆప్క గజ్జరాం, జీ వీ రమణా రావు, పిప్పె ర వెంగల్ రావు,జుట్టు మహేందర్, నవీన్ ,జక్కని గజేందర్, తదితరులు పాల్గొన్నారు.