- ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, వెలుగు : పినపాక నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం అశ్వాపురం మండలంలోని ప్రసిద్ధ నీటి సరస్సు తుమ్మలచెరువులో బోటింగ్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువుతోపాటు మణుగూరు మండలంలోని రేగుల గండి చెరువు, చిన్నరావి గూడెం వద్ద గోదావరి నదిలో బోటింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, లీటర్లు, అధికారులు పాల్గొన్నారు.