- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
వర్ని/ పోతంగల్, వెలుగు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వర్ని మండల ఆఫీస్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన నమూనాను పరిశీలించారు.
ఇండ్ల నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా అర్హులకే ఇండ్లు కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం బడాపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా జలాల్‌పూర్ లో నిర్వహించిన సంధాల్ లో ఆయన పాల్గొన్నారు. పోతంగల్లోనూ పలు గ్రామాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన వెంట రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ పాల్గొన్నారు.