నా జోలికొస్తే అడ్డంగా నరుకుతా : ఎమ్మెల్యే రాజాసింగ్

నా జోలికొస్తే అడ్డంగా నరుకుతా : ఎమ్మెల్యే రాజాసింగ్
  • గోషామహల్​లో నేను బైక్ పైనే తిరుగుతా
  • పోలీసుల నోటీసులను పట్టించుకోను
  • ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

బషీర్​బాగ్, వెలుగు: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ కు హాని ఉందని, ఆయన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో 1+4 సెక్యూరిటీతోనే బయటకు వెళ్లాలని మంగళ్ హాట్ పోలీసులు ఇటీవల ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు. కాగా, సోమవారం ఎమ్మెల్యే రాజా సింగ్ తన కొడుకు, పార్టీ కార్యకర్తలతో బైకులపై గోషామహల్ నియోజకవర్గంలో తిరిగారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను ప్రజలను కలిసేందుకు, వారి సమస్యలను తెలుసుకొనేందుకు బైక్ పైనే తిరుగుతానని స్పష్టం చేశారు. తన వైపు కానీ, తన ఫ్యామిలీ వైపు కానీ ఎవరైనా(టెర్రరిస్టులు) కన్నెత్తి చూస్తే వారిని అడ్డంగా నరుకుతానని హెచ్చరించారు.