
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బిజినేపల్లి మండలం అల్లిపూర్, తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మాయమాటలు చెప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని చెప్పారు.
నాగర్ కర్నూల్ మండలం బొందలపల్లి గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి లో వోల్టేజీ సమస్య తీర్చినట్లు తెలిపారు. తాడూరు మండలం శిరసవాడ గ్రామ శివారులో రూ.20.20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.