శాశ్వత మార్కెట్​కోసం కృషి చేస్తా : రాందాస్​ నాయక్

  • ఎమ్మెల్యే రాందాస్​ నాయక్

జూలూరుపాడు, వెలుగు : జూలూరుపాడు లోని ఉప మార్కెట్​ ను శాశ్వత మార్కెట్​ గా మార్చేందుకు కృషి చేస్తానని వైరా ఎమ్మెల్యే రాందాస్​నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో  లైసెన్స్​ ట్రేడర్స్​ ఎమ్మెల్యే రాందాస్​ నాయక్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రయివేట్​ స్థలంలో మార్కెట్​ నిర్వహించడంతో సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. పత్తి కొనుగోలుదారులు మార్కెట్ యార్డులో విద్యుత్ నిలిపివేశారని తెలుసుకొని వెంటనే విద్యుత్ కలెక్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మాలోత్ మంగీలాల్, పెండ్యాల రాము. అన్వర్. నవీన్,హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

వైరా : వైరా నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించి రూ.78.11 లక్షల విలువైన 240 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఆపదలో సీఎంఆర్​ఎఫ్​ అండగా ఉంటుందన్నారు.