- ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్, వెలుగు: పల్లెల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. రాయికల్‌లో రూ.9 లక్షలతో ఓపెన్ జిమ్, రూ.32 లక్షలతో నిధులతో లైబ్రరీ భవనాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆనంతరం రాయికల్ పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించారు. పాలక సభ్యుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా సత్కరించారు. అనంతరం పట్టణానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3 లక్షల 50 వేల చెక్కులను, 40 మందికి కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ ద్వారా వచ్చిన రూ.40 లక్షల చెక్కులను అందించారు.
గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేసే లైబ్రరీ సెస్ ద్వారా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మోర హనుమండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు, ప్యాక్స్ చైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎంపీడీఓ చిరంజీవి, తహసీల్దార్ ఎంఎ ఖయ్యూమ్, జిల్లా లైబ్రరీ సెక్రటరీ సరిత పాల్గొన్నారు.