- వైద్య శాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. వైద్య కాలేజీకి అనుబంధంగా 200 బెడ్ల హాస్పిటల్‌ను మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి జగిత్యాల నియోజకవర్గంలో డీ- 53 జోన్ 1 కింద నీటి సరఫరాను కొనసాగించాల్సిందిగా కోరారు.
హెచ్‌ఎంపీవీపై ఆందోళన వద్దు
జగిత్యాల రూరల్, వెలుగు: హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై భయపడవద్దని, జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రజలకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో హెచ్ఎంపీవీ వ్యాప్తి, అవగాహనపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ మాట్లాడుతూ హెచ్‌ఎంపీవీ 2001 నుంచి ఉందని, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారికి త్వరగా సోకే అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సుధీర్ కుమార్, రజిత పాల్గొన్నారు.