నారాయణ్ ఖేడ్, వెలుగు: మండలంలోని తుర్కపల్లి, హనుమంతరావుపేటలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి గురువారం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ మద్దతు ధరతో విక్రయించుకోవాలన్నారు. వరి గ్రేడ్ ఏ రకానికి రూ.2320, సాధారణ రకానికి రూ.2300 ఇస్తున్నామన్నారు.
సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. ఐకేపీ అధికారులు, కాంగ్రెస్ లీడర్లు రమేశ్ చౌహాన్, పండరి రెడ్డి, అశోక్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్,ఈశ్వరప్ప, శంకర్, దత్తు గౌడ్, నరసింహా రెడ్డి, నెహ్రూ నాయక్, జ్ఞానేశ్వర్ రెడ్డి,అశోక్ రెడ్డి, రాజు నాయక్, శివ కుమార్, ఎంకన్న, సాగర్ పాల్గొన్నారు.