ప్రజల సమక్షంలోనే అర్హులను గుర్తించాలి: సునీతా లక్ష్మారెడ్డి

ప్రజల సమక్షంలోనే అర్హులను గుర్తించాలి: సునీతా లక్ష్మారెడ్డి
  • ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

కౌడిపల్లి, వెలుగు: ప్రజల సమక్షంలోనే సంక్షేమ పథకాల అర్హులను గుర్తించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం ఆమె మండలంలోని నాలుగు గ్రామాల్లో  గ్రామసభలకు హాజరయ్యారు.  నాగసాన్​పల్లిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గానికి మంజూరు చేసిన 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా అధికారులకు ఇస్తే ఎలా ఉంటుందో గ్రామసభల్లో తెలిసిందన్నారు. కొట్లాటలు పెట్టడం తప్ప గ్రామసభలతో ఎలాంటి ఫాయిదా లేదన్నారు. 

కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా గొడవలకు ఆస్కారం ఇచ్చే గ్రామ సభలు పెట్టలేదని, ఇచ్చేటివి డైరెక్ట్ గా ఇచ్చామన్నారు. కౌడిపల్లి గ్రామ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఇండ్లు ఉన్నవారికి మళ్లీ ఇండ్లు ఇవ్వడం ఏంటని అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు కల్పించుకొని అర్హులైన వారి పేర్లు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీంతో కొంతసేపు గ్రామసభ గందరగోళంగా మారింది.