వైభవంగా చాముండేశ్వరీ ఆలయ వార్షికోత్సవం : సునీతారెడ్డి

వైభవంగా చాముండేశ్వరీ ఆలయ వార్షికోత్సవం :  సునీతారెడ్డి
  • పట్టువస్త్రాలు సమర్పించినఎమ్మెల్యే సునీతారెడ్డి

చిలప్ చెడ్, వెలుగు: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ చాముండేశ్వరీమాత ఆలయ 42వ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. 

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అమ్మవారిని దర్శించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించి, కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్ రెడ్డి, నాయకులు లక్ష్మణ్, రాజిరెడ్డి, రామచంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, భిక్షపతి, నరేందర్ రెడ్డి, దుర్గారెడ్డి, బాల్ రాజు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభం

శివ్వంపేట: మండల పరిధిలోని సికింద్లాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సంక్రాంతి తర్వాత ఉగాది వరకు ప్రతి ఆదివారం జాతర జరుగుతుంది. కాగా, ఆదివారం నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఈ జాతరను ప్రారంభించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్, ఆలయ ప్రధాన పూజారి ధనుంజయ శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ ఎంపీపీ హరికృష్ణ. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణ గౌడ్, జడ్పీ మాజీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్ అలీ, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, నాయకులు హనుమంత్ రెడ్డి, యాదగౌడ్, మహేందర్ రెడ్డి, లక్ష్మణ్, ముత్యాలు పాల్గొన్నారు.