వరంగల్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వరంగల్ భద్రకాళీ ఆలయంలో రాజశ్యామలయాగం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తనకు టికెట్ కేటాయించాలని, ఐదో సారి ఎమ్మెల్యేగా గెలువాలని అమ్మవారిని వేడుకుంటున్నట్టు చెప్పారు. రాజశ్యామల యాగం చాలా పవర్ ఫుల్ అని తెలిపారు.ః
శత్రుబాధ నివారణకు ఈ యాగం పవర్ ఫుల్ అని తెలుసుకొన్నట్టు చెప్పారు. పార్టీలో, బయట ప్రతిపక్షాల్లో ఉన్న శత్రువుల నుంచి బాధలు తొలగిపోతాయని వేదపండితులు చెప్పారని, అందుకే ఈ యాగం చేస్తున్నట్టు తెలిపారు.