కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

 కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో గురువారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 16 మంది లబ్ధిదారులకు అందజేశారు. దుమ్ముగూడెం మండల కేంద్రంలోనూ 31మంది ఆడబిడ్డలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.