భద్రాచలంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

భద్రాచలంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రోటరీ క్లబ్​ ఆధ్వర్యంలో 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్​ హైదరాబాద్​ ఈ కుట్టుమిషన్లను అందజేసింది. ఏజెన్సీలో రోటరీ క్లబ్​ చేస్తున్న సేవలు చాలా గొప్పగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశంసించారు.

 ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్​ గవర్నర్​ బూసిరెడ్డి శంకర్​రెడ్డి, భద్రాచలం అధ్యక్షుడు డాక్టర్​రమేశ్, కార్యదర్శి ధనికొండ రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.