నారాయణపేట, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసమే కుటుంబ సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. సర్వే నిర్వహణపై పట్టణంలో పేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నాయకులు, కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి కుల గణన చేపట్టటానికి నిర్ణయించిందని తెలిపారు.
ప్రతి కుటుంబం స్థితిగతులు తెలుస్తాయని, ఆ తరువాత పథకాలు, ఉద్యోగాలు, వైద్యం తదితర విషయాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్యుమరేటర్లకు సహకరించాలన్నారు. పీసీసీ మెంబర్ చిట్టెం అభిజయ్‌రెడ్డి, లైబ్రరీ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి, ఈదప్ప పాల్గొన్నారు.