వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపం ప్రారంభం

బాల్కొండ, వెలుగు : మెండోరా మండల కేంద్రంలో  నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.40 లక్షలతో వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపం నిర్మించినట్లు తెలిపారు.

స్వామి ఆశీస్సులతో మెండోరాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, బీఆర్ఎస్ లీడర్లు శేఖర్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.