- పార్టీలో పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు
- ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డిటౌన్, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేలా కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా ఇప్పటినుంచే పనిచేయాలన్నారు. బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్‌గా నియమితులైన నీలం చిన్న రాజులు జిల్లా కేంద్రంలోని పార్టీ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్‌గెస్ట్‌గా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కార్యకర్తలు రెడీగా ఉండాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా పార్టీని విస్తరింపజేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒకరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. పార్టీ జిల్లా మాజీ ప్రెసిడెంట్అరుణతార, మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులు, నాయకులు మురళీధర్‌గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, తేలు శ్రీనివాస్, ఆయా మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, లీడర్లు, కార్యకర్తలు
పాల్గొన్నారు.