- ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను దశలవారీగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎంతమంది అర్హులు ఉంటే అన్ని కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులను అందిస్తామన్నారు. ఈనెల 26 నుంచి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు చెప్పారు.
తాను ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ గర్రెపల్లి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా పాలనను చూసి బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు దామోదర్ రావు, చిలుక సతీశ్, పన్నాల రాములు, వెంకటరమణారావు, జానీ, బండారి రమేశ్, రాజిరెడ్డి, శ్రీనివాస్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, ఏఈ సచిన్ పాల్గొన్నారు.