రోడ్లు వేయకుండా ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డుపడ్తున్నరు : ఎమ్మెల్యే వినోద్​

రోడ్లు వేయకుండా ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డుపడ్తున్నరు : ఎమ్మెల్యే వినోద్​
  • ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో సమస్యను పరిష్కరించండి: ఎమ్మెల్యే వినోద్​

హైదరాబాద్​, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో చాలా సమస్యలున్నాయని, వాటిని సభలో ప్రస్తావించేందుకు ఎమ్మెల్యేలకు  అవకాశం ఇవ్వాలని  బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్​ అన్నారు. రోడ్లు వేయకుండా అటవీ అధికారులు అడ్డుపడ్తున్నారని తెలిపారు. చెన్నూరు నుంచి బెల్లంపల్లి వరకు తాను మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లకు ఇప్పటికీ రిపేర్లు లేవన్నారు. 

వాటి రిపేర్లకు అనుమతిచ్చేలా ఫారెస్ట్ ఆఫీసర్లకు ఆదేశాలివ్వాలని శనివారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. తాను ఐదు రోజుల నుంచి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నా టైం ఇవ్వడం లేదన్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. సభలోని  119 ఎమ్మెల్యేలు మాట్లాడాలంటే టైమ్ సరిపోదని, సభ రూల్స్ గురించి తన కంటే ఆయనకే ఎక్కువ తెలుసన్నారు.