మల్లన్న ఆశీస్సులతో చెన్నూరు అభివృద్ధి : ఎమ్మెల్యే వివేక్

మల్లన్న ఆశీస్సులతో  చెన్నూరు అభివృద్ధి : ఎమ్మెల్యే వివేక్
  • కోరిన కోర్కెలు తీర్చే దేవుడు గట్టు మల్లన్న: ఎమ్మెల్యే వివేక్
  • వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలి
  • జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌలత్​లు కల్పించామని వ్యాఖ్య
  • కొండెక్కి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే దంపతులు

కోల్ బెల్ట్/జైపూర్/గోదావరిఖని/పెద్దపల్లి, వెలుగు: మల్లికార్జునస్వామి ఆశీస్సులతో చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్నస్వామి జాతరలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి, -సరోజ దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మల్లికార్జునస్వామిని వేర్వేరుగా దర్శించుకున్నారు. నడుచుకుంటూ కొండపైకి వెళ్లి మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులు, ఎంపీ వంశీకృష్ణకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేలాల గ్రామంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి, చెన్నూరు మండలం కత్తెరశాలలోని మల్లికార్జునస్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. ‘‘కోరిన కోర్కెలు తీర్చే దేవుడు గట్టు మల్లన్న. ఆ మహాదేవుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి. మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలి. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌలత్​లు కల్పించాం. రానున్న రోజుల్లో వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాం. గట్టపైకి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈసారి వీఐపీ, ఇతర వెహికల్స్ అనుమతించలేదు. వృద్ధులు, పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగినవారు గట్టుపైకి వెళ్లేలా స్పెషల్ వెహికల్స్ అందుబాటులో ఉంచాం’’అని వివేక్ తెలిపారు. 

వేలాలలో జాతరకు వచ్చే భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లకు అటవీ శాఖ పూర్తిగా సహకరించిందన్నారు. ఎక్కడా ఫారెస్ట్ రూల్స్ ఉల్లంఘించకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. దేవాదాయ, రెవెన్యూ, సింగరేణి, పోలీసు, ఇతర శాఖలతో పాటు దాతలు జాతర ఏర్పాట్లకు సహకరించారని చెప్పారు. గట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి గుట్టపైకి చేరడం, తిరిగివెళ్లేందుకు భక్తుల కోసం ఈసారి రెండు రోడ్లను ఏర్పాటు చేశామని, ట్రాఫిక్​ ఇబ్బందులు కలగకుండా చూశామన్నారు. జాతర సక్సెస్​కు కృషి చేసిన అందరికి ఎమ్మెల్యే వివేక్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

వేలాల మల్లన్న, రాజరాజేశ్వర స్వాముల అనుగ్రహంతో ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​తో కలిసి బెల్లంపల్లి మండలంలోని బుగ్గ శ్రీ రాజరాజేశ్వరస్వామి, జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల అర్చకులు గడ్డం వంశీకృష్ణ, గడ్డం వినోద్​కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.  భక్తుల విశ్వా సం మరింత పెరిగేలా వేలాల గట్టు మల్లన్న స్వామి, బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. 

అనంతరం నస్పూర్ మండల కేంద్రంలోని కృష్ణాకాలనీ శివాలయంలో ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. తర్వాత.. గోదా వరిఖని జనగామ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని వంశీకృష్ణ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వంశీ కృష్ణను ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ, సెక్రటరీ శివ, అర్చకులు రమేశ్ వర్మ, కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.  ఎంపీ వెంట లీడర్లు మల్లికార్జున్, కామ విజయ్, గోవర్ధన్ రెడ్డి, మల్లేశ్ యాదవ్,  మధు, జావిద్ తదితరులు న్నారు. అనంతరం పెద్దపల్లి శివాలయంలో  వంశీ కృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.  వంశీ కృష్ణ వెంట దిశ కమిటీ మెంబర్ సయ్యద్ సజ్జా ద్, పార్టీ నేతలు  సునీల్, బాలసాని సతీశ్,  సం తోష్, కృష్ణమూర్తి, ప్రశాంత్ తదితరులున్నారు.