- పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అన్నదానాలు
- రోగులకు పండ్లు పంపిణీ
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ ఆధ్వర్యంలో సివిల్ హాస్పిటల్లో రోగులకు అల్పాహారం అందించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎలిగేడు మండల కేంద్రంలో అడ్డగుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో కాంగ్రెస్ నాయకుడు అల్లం సతీష్ వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేశారు. బాలసాని సతీశ్, గంగుల సంతోశ్, బండారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
దుప్పట్లు పంపిణీ
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి బర్త్ డే వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు. అనంతరం మానసిక వికలాంగులకు దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ధరడే శ్యామ్, కనుకుంట్ల శ్రీనివాస్, మల్యాల కరుణాకర్, చొప్పరి వెంకటేశ్, కలవేణి స్వామి, చొప్పరి రాజు, కే. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన నర్మెట అఖిల్ అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేశారు.