తొర్రూరు/ రాయపర్తి, వెలుగు: అభివృద్ధిలో తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆడిటోరియం నిర్మాణానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులతోకలిసి నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.5.25 కోట్లతో ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, కమిషనర్ శాంతి కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్జిల్లా రాయపర్తి మండలం ఏకేతండాకు చెందిన ధరావత్ గోపి పొలం వద్ద నాటు వేస్తుండగా కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అంతిమయాత్రలో పాల్గొని, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.