పాలమూరులో ‘నవరత్నాలు’

పాలమూరులో ‘నవరత్నాలు’
  • ఎడ్యుకేషన్​ డెవలప్​మెంట్‌‌‌‌‌‌‌‌కు మొదటి ప్రాధాన్యం
  • ఈ నెల 8  నుంచి స్కిల్ డెవలప్​మెంట్​ సెంటర్​లో శిక్షణా తరగతులు

మహబూబ్​నగర్​, వెలుగు: మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి ప్రయోగాత్మకంగా ‘మహబూబ్​నగర్​ ఫస్ట్​’  పేరుతో ఇటీవల నవరత్నాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో హెల్త్​, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్​మెంట్​, స్కిల్స్ డెవలప్​మెంట్​తదితర రంగాల్లో యూత్, మహిళలు రాణించి ఉపాధి పొందేలా శిక్షణ ఇవ్వనున్నారు.  ఎమ్మెల్యే  తన సొంత నిధులతో పాటు సెట్విన్​ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంకు రూపకల్పన చేశారు. ఈ నెల 8న స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్​లో ఫ్రీగా కోచింగ్​ క్లాస్లెస్​ స్టార్ట్​ చేయనున్నారు.

నవరత్నాలు ఇవే.. 

నవరత్నాల్లో  తొమ్మిది రకాల కార్యక్రమాల రూపకల్పన చేశారు. 'విద్యా నిధి' ద్వారా చదువుకు దూరమవుతున్న అన్ని వర్గాల పిల్లలకు చదువు చెప్పించడం. ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌ ‘విద్యా నిధి’ కమిటీలను ఏర్పాటు చేయిస్తారు. ‘ఆరోగ్య నిధి’ ద్వారా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించనున్నారు.  ప్రతి వార్డు, గ్రామంలో ఆరోగ్య కమిటీలు నియమించనున్నారు.  'మయూరి' ద్వారా యూత్​, మహిళలకు వివిధ రంగాల్లో ట్రైనింగ్​ ఇవ్వనున్నారు. 

‘పయోనీర్​’  ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్న స్టూడెంట్లకు ఫ్రీగా మెడికల్​అండ్​ ఇంజనీరింగ్​ ఎంట్రెన్స్​కు సంబంధించిన స్టడీ మెటీరియల్​ ఇవ్వడంతో పాటు లెక్చరర్లతో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంను మహబూబ్​నగర్​ బాయ్స్​ కాలేజ్​లో స్టార్ట్​ చేశారు.  ప్రస్తుతం 200 మంది స్టూడెంట్లకు ఫ్రీగా క్లాసులు నిర్వహిస్తున్నారు. మహబూబ్​నగర్​ అకాడమీ ఫర్​ స్కిల్​ అండ్​ నాలెడ్జ్​ (మాస్క్​) ద్వారా టెన్త్​, ఇంటర్​, డిగ్రీ, పీజీ చదువుకున్న వారికి ఇష్టమైన స్కిల్స్​లో ట్రైనింగ్​ ఇవ్వనున్నారు. 

 రిటైర్డ్​ ఎంప్లాయిస్​ వెల్ఫేర్​ అండ్​ ఎంగేజ్​మెంట్​ ప్రోగ్రాం​ కింద రిటైర్డ్​ ఉద్యోగుల సేవలు వినియోగించుకోనున్నారు. విద్యా నిధి, ఆరోగ్య నిధి, గ్రీన్​ వారియర్స్​ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత వీరికి అప్పగించనున్నారు. మహబూబ్​నగర్​ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ (మా) ద్వారా మరుగునపడిన కళాకారులను గుర్తించి ప్రోత్సహించనున్నారు.  గేమ్స్​ అండ్​ స్పోర్ట్స్​లవన్​ ఫోరమ్​ ద్వారా క్రీడలపై ఆసక్తి ఉన్న వారిని ఏకం చేసి వారి సలహాలు​ తీసుకోనున్నారు.  ‘గ్రీన్​ వారియర్స్’​  ద్వారా పాలమూరును పచ్చదనంగా రూపొందించనున్నారు.  స్టూడెంట్లు, రిటైర్డ్​ఉద్యోగులు, యూత్​, మహిళలను భాగస్వామ్యం 
చేయనున్నారు. 

స్కిల్​ అండ్​ నాలెడ్జ్​కు వెయ్యి అప్లికేషన్లు 

స్కిల్​ అండ్​ నాలెడ్జ్​ ద్వారా యూత్​, మహిళలకు బ్యూటీషియన్​, ఫ్యాషన్​ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్​ కోర్సులు ఫ్రీగా నేర్పించనున్నారు. ఈ సెంటర్​ను రెడ్డి హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల ఐటీ మినిస్టర్​ శ్రీధర్​బాబు ప్రారంభించారు.  ఇప్పటి వరకు వెయ్యి అఫ్లికేషన్లు వచ్చాయి.  మూడు కోర్సులకు మొత్తం 180 మందికి ట్రైనింగ్​ ఇవ్వనున్నారు. రెండు రోజుల కిందట ఫ్యాకల్టీ నుంచి అప్లికేషన్​లు తీసుకున్నారు.  40 కంప్యూటర్లను, 20 కుట్టు మెషీన్​లను సిద్ధం చేశారు.  ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్​ ద్వారా సర్టిఫికెట్స్​ ఇవ్వనున్నారు.

వితౌట్​ స్కిల్​ ఎవరూ ఉండొద్దు

ఇప్పుడున్న జనరేషన్​లో ఎవరూ కూడా స్కిల్స్ లేకుండా ఉండొద్దు. ఇంట్లో కూర్చున్న హౌస్​ వైఫ్​ అయిన, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లకైనా ఏదో ఒక ఎక్స్​ట్రా క్వాలిఫికేషన్​ ఉండాలే.  అందుకే స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ ద్వారా కంప్యూటర్​, ఫ్యాషన్​ డిజైనింగ్​, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్​ కోర్సులు నేర్పిస్తాం.  రాబోయే పదేండ్లలో 20 వేల మందికి ట్రైనింగ్​ ఇవ్వాలని టార్గెట్​గా పెట్టుకున్నాం. ఇందుకు సంబంధించిన ఫండ్స్​ను సమకూర్చుకుంటున్నాం. ప్రభుత్వ సాయం కూడా తీసుకుంటాం. - యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్​నగర్​

స్వయం ఉపాధి పొందేందుకు అప్లై చేసిన..

మాకు ఇద్దరు పిల్లలు. మా ఆయన ప్రైవేట్​ఎంప్లాయ్​. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు చాలా పెరిగాయి. మా ఆయన జీతం సరిపోవడం లేదు.  స్వయం ఉపాధి పొందేందుకు బ్యూటీషియన్​ కోర్సు చేయడానికి అప్లికేషన్​ పెట్టుకున్నాను.  సొంతంగా సెంటర్​ పెట్టుకొని స్వయం ఉపాధి పొందుతా.
- పి.మంజుల, మధురానగర్​ కాలనీ, మహబూబ్​నగర్​