
- కాంగ్రెస్కు రైతుల ఉసురు తగులుతది: ఎమ్మెల్సీ కవిత
- పెద్దగట్టు జాతరకు హాజరు
సూర్యాపేట, వెలుగు: సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డికి రైతుల గోడు పట్టడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పంటలు ఎండి రైతులు ఆందోళన చెందుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాట లతో మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుంది. తెలంగాణకు నీళ్లు మలపాలన్న సోయి రేవంత్ రెడ్డికి లేదు. రాజకీయ కక్షతో మేడిగడ్డను వాడుకోక తెలంగాణను ఎండబెడుతున్నరు” అని దుయ్యబట్టారు.
మంగళవారం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో కవిత పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. అనంతరం సూర్యాపేట బీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లా డారు. బనకచర్లలో 199 టీఎంసీలతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని, అనుమతుల కోసం ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నా రని.. కానీ మన సీఎం మాత్రం నాగార్జునసాగర్ ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారని విమర్శించారు.