కేసీఆర్ మంచోడు కావొచ్చు.. నేను రౌడీ టైపే! : ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ మంచోడు కావొచ్చు.. నేను రౌడీ టైపే! : ఎమ్మెల్సీ కవిత
  • ఎవరి బెదిరింపులకు భయపడ: ఎమ్మెల్సీ కవిత
  • అందరి పేర్లు పింక్ బుక్​లో రాసుకుంటున్నాం
  • అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలమని వార్నింగ్

బాన్సువాడ/కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్ లీడర్లను బెదిరిస్తున్న వాళ్ల పేర్లను పింక్ బుక్​లో రాసుకుంటా మని, తాము పవర్​లోకి వచ్చాక వాళ్లు అధికారు లైనా.. నాయకులైనా వదిలిపెట్టమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ‘‘కేసీఆర్ సార్ మంచోడు కావొచ్చు.. కానీ, నేను మాత్రం రౌడీటైపే. ఎవరి బెది రింపులకు భయపడ. వరంగల్​లో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు వెళ్లొద్దని మా కార్యకర్తలకు కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నరు. మా వాళ్లను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నరు. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’అని కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సు వాడలో మంగళవారం బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు.

 పార్టీ నుంచి బయటకెళ్లినవాళ్లు ప్రజల కోసం పోలేదని, డబ్బుల కోసమే పార్టీలు మారారని అన్నారు. పోయినోళ్ల గురించి పట్టించుకోవద్దని తెలిపారు. బాన్సువాడలో ఉప ఎన్నిక రావటం ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రజతోత్సవ సభకు ఇంటికొక కార్యకర్త తరలిరావాలన్నారు. సమావేశంలో నిజామాబాద్​ రూరల్​ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ ర్ధన్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, లీడర్లు గణేశ్, సాయిబాబా, చందు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.