రేవంత్ విద్యా కిట్ తీసుకురావాలి: ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి

రేవంత్ విద్యా కిట్ తీసుకురావాలి: ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి

మారుతున్న విద్యా వ్యవస్థ తీరుకు అనుగుణంగా ‘రేవంత్ విద్యా కిట్’ పేరుతో షూస్, టై, బెల్ట్.. ఇలా 16 అంశాలతో కూడిన కిట్ ను రాష్ట్రంలోని స్టూడెంట్స్ కు అందించాలని ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. షూస్, టై, బెల్ట్ తో స్కూల్ బస్సుల్లో పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించడం ఇప్పుడు సోషల్ స్టేటస్​లా మారిందని, ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు కిట్ తో పాటు, బసుల్లో స్కూళ్లకు చేర్చాలని కోరారు.

అలాగే, స్టూడెంట్స్ సంఖ్య తక్కువగా ఉన్న స్కూళ్లను మెర్జ్ చేసి, క్లాసుకో టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాబ్ క్యాలెండర్ మాదిరిగానే అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించి ట్రాన్స్​ ఫర్లు, ప్రమోషన్లు సమయానికి చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.