
- ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీపీఎస్ రద్దుకు కృషి చేస్తానని ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసినట్లు గుర్తుచేశారు. ఈ ఎండాకాలంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు తంగేళ్ల జితేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్, మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొలికొండ కోటయ్య, పప్పుల వీరబాబు, రాష్ట్ర నాయకులు కందుకూరి శివశంకర్, గుగులోతు తావురియా, కట్కూరు మధుసూదన్ రెడ్డి, గోదాసు దయాకర్, మేకల రాజశేఖర్, అల్లాడి సత్యనారాయణ, వల్లెం శంకర్ ప్రసాద్, షేక్ బషీర్, వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.