పవన్.. అన్నింటికీ సమాధానం చెప్తా.. మంచు విష్ణుకు ఓటెయ్

  • చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్ .. సంతోషమే

‘‘రిపబ్లిక్‌’’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో జనసేన అధినేత, హీరో పవన్‌ కళ్యాణ్‌ చేసిన కామెంట్స్ పై సీనియర్ హీరో మోహన్‌ బాబు స్పందించారు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్.. సంతోషమే.. అక్టోబర్‌ 10వ తేదీన ‘మా’ ఎన్నికలు ఉన్నాయి.. ఆ ఎన్నికల తరవాత నిన్న పవన్‌ కళ్యాణ్‌ అడిగిన ప్రతి మాటకు తాను హృదయ పూర్వకంగా సమాధానం ఇస్తానని మోహన్ బాబు ఇవాళ ట్వీట్‌ చేశారు. ఈలోగా నీ అమూల్యమైన ఓటును నా కుమారుడు, నీకు సోదర సమానుడైన విష్ణుబాబు ప్యానల్ కు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
మోహన్ బాబు ట్వీట్ లో  ఏం చెప్పారంటే..
నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించాను. పవన్ కళ్యాణ్ గారు అని అనడంలో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ' మా ' ఎన్నికలు జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న విషయం నీకు తెలిసిందే. అక్టోబర్ 10 వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని .. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్ కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను అన్నారు మోహన్‌బాబు..

 

మరిన్ని వార్తల కోసం: 

బెదిరింపులు వచ్చినా మేం భారత్‌కు వెళ్లినం

పండుగలు వస్తున్నయ్.. కొవిడ్ రూల్స్ తప్పక పాటించాలె

జగన్ గారూ.. రాజకీయాలు పక్కనపెట్టి సినీ ఇండస్ట్రీని కాపాడండి