Empuraan Box Office: మోహన్ లాల్ ఎంపురన్ ఫస్ట్ డే బాక్సాఫీస్.. మలయాళ సినిమాల రికార్డులన్నీ బ్రేక్

Empuraan Box Office: మోహన్ లాల్ ఎంపురన్ ఫస్ట్ డే బాక్సాఫీస్.. మలయాళ సినిమాల రికార్డులన్నీ బ్రేక్

మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురన్ మూవీ వద్ద అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. ఫస్ట్ డే (మార్చి 27న) ఇండియా వైడ్గా రూ.22 నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు మలయాళంలో ఉన్న సినిమాల కలెక్షన్స్ ను బ్రేక్ చేసింది.

గతేడాది (2024) ఎంపురన్ డైరెక్టర్ పృథ్వీరాజ్ హీరోగా నటించిన 'ది గోట్ లైఫ్' రూ.8.9 కోట్లతో ఉన్న రికార్డ్ ను ఈ మూవీ బ్రేక్ చేసింది. అంతేకాకుండా.. లూసిఫర్ ఫస్ట్ పార్ట్ తొలిరోజు రూ.6.1కోట్లుతో ఉన్న రికార్డును వెనక్కి నెట్టింది. ఎల్2 ఎంపురన్ ని తెరకెక్కించిన హీరో అండ్ డైరెక్టర్స్ తమ రికార్డులను తామే బ్రేక్ చేయడం విశేషం. 

ట్రాకింగ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ ప్రకారం:

ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వద్ద దాదాపు రూ. 22 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మలయాళంలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. అక్కడ ఏకంగా రూ.19.45 కోట్లు వసూళ్లు చేసింది.

తెలుగు వెర్షన్ రూ. 1.2 కోట్లు రాబట్టింది. తమిళం, కన్నడ, హిందీ వెర్షన్లు వరుసగా దాదాపు రూ. 80 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 50 లక్షలు వసూలు చేశాయి. ఇది మొత్తం ఇండియా, వరల్డ్ వైడ్  వసూళ్లను బట్టి ఈ మూవీ రూ.50 కోట్లు (గ్రాస్) వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వసూళ్లు వీకెండ్ అయిపోయేసరికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎంపురన్ వందకోట్ల మార్కును రిచ్ అవ్వొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా!

Also Read:-ఎన్టీఆర్పై అభిమానంతో తెలుగు నేర్చుకున్న జ‌పాన్ అమ్మాయి..

ఎల్2: ఎంపురన్ ఫస్ట్ డే..మలయాళంలో  60 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు అయింది. కొచ్చి, కోళికోడ్ లాంటి ప్రాంతాల్లో అయితే 90 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఈ ప్రాంతాలు మోహన్ లాల్ కు బాగా ఫాలోయింగ్ అని చెప్పవచ్చు. .

ఫస్ట్ పార్ట్ "లూసిఫర్" రూ.30 కోట్లతో తీస్తే, రూ.125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన, ఎనిమిదో మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ కలెక్షన్లు, శాటిలైట్ హక్కులు మరియు ఇతర భాషలలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల అమ్మకం ద్వారా సినిమాకు రూ.200 కోట్లకు పైగా ఈ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా తెలుగులో "గాడ్ ఫాదర్" పేరుతో రీమేక్ చేయబడింది.

  • Beta
Beta feature