- డబ్యూహెచ్ఓ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్రం
- గుర్తించడం కోసం ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కిట్ ను డెవలప్ చేసిన WHO
మంకీ ఫాక్స్..ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పటి వరకు 12 దేశాలకు విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు సుమారు 80 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మంకీ ఫాక్స్ ను గుర్తించడం కోసం ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కిట్ ను అభివృద్ధి చేసినట్లు ట్రివిట్రాన్ హెల్ కేర్ సంస్థ ప్రకటించింది. ఈ టెస్ట్ మసూచీ, మంకీ ఫాక్స్ మధ్యతేడాను గుర్తిస్తోందని అధికారులు ప్రకటించారు.
అర్జెంటినాలో రెండు కొత్త కేసులు
తమ దేశంలో రెండు మంకీ ఫాక్స్ కొత్త కేసులు నమోదైనట్లు అర్జెంటీనా వెల్లడించింది. స్పెయిన్ దేశం నుండి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు శుక్రవారం పరీక్షలు చేయగా మంకీ ఫాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని అర్జెంటినా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. మంకీ ఫాక్స్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్ ప్రమాదకరమైనది అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ దేశాలలో ఈ వైరస్ ప్రబలుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ సోకి ఈ ఏడాది 57 మంది చనిపోయినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో కేసు.. రాంగోపాల్ వర్మ కంప్లైంట్
ఎన్టీఆర్కు టీఆర్ఎస్ మంత్రులు, నేతల నివాళి