మైనర్ల డ్రైవింగ్​తో 361 ప్రమాదాలు

మైనర్ల డ్రైవింగ్​తో 361 ప్రమాదాలు

హైదరాబాద్, వెలుగు: మైనర్ల డ్రైవింగ్​ కారణంగా రాష్ట్రంలో 361 రోడ్డు ప్రమాదాలు జరిగాయని కేంద్రం వెల్లడించింది. 2023–24లో దేశవ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్​తో 11,890 రోడ్డు ప్రమాదాలు జరగగా.. ఇందులో తెలంగాణలో 361 జరిగినట్లు పేర్కొంది. బుధవారం లోక్‌సభ సమావేశాల్లో వివరాలు వెల్లడించింది. ప్రతిరోజు సగటున16 రోడ్డు ప్రమాదాలకు మైనర్లు కారణమవుతున్నట్లు రిపోర్టులో తెలిపింది. తమిళనాడులో అత్యధికంగా 2,063, మధ్యప్రదేశ్‌లో 1,138, మహారాష్ట్రలో 1,067, ఏపీలో 766 రోడ్డు ప్రమాదాలు మైనర్ల డ్రైవింగ్​తో జరిగినట్లు పేర్కొంది.