
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఒక్కటే మిగిలి ఉంది. గోల్డెన్ బ్యాట్ గెలుచుకుకోవడానికి మాత్రం అరడజను క్రికెటర్లు రేస్ లో ఉన్నారు. ఆదివారం (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్ తర్వాత టోర్నీ టాప్ స్కోరర్ ఎవరో తెలిసిపోతుంది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి గోల్డెన్ బ్యాట్ ఇస్తారు. ఈ స్పెషల్ బ్యాట్ ఎవరు గెలుచుకుంటారో ఇప్పుడు చూద్దాం.
1) బెన్ డకెట్ (ఇంగ్లాండ్) -
ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ప్రస్తుతం 227 రన్స్ తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. మూడు మ్యాచ్ లో
ఈ ఇంగ్లీష్ ఓపెనర్ 75.66 సగటుతో 227 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై జరిగిన లీగ్ మ్యాచ్ లో అతను 165 పరుగుల మారథాన్
ఇన్నింగ్స్ ఆడాడు. టాప్ స్కోరర్ గా ఉన్నప్పటికీ డకెట్ కు గోల్డెన్ బ్యాట్ రావడం కష్టంగానే కనిపిస్తుంది.
2) రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచీన్ రవీంద్ర సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు టోర్నీలో రెండు సెంచరీలతో 226 పరుగులు చేసి
రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న రచీన్.. ఫైనల్లో భారీ స్కోర్ కొట్టగలిగితే గోల్డెన్ బ్యాట్ సొంతం చేసుకోవచ్చు.
Also Read :- ఇంగ్లాండ్ క్రికెటర్‌పై హర్మన్ ప్రీత్ కౌర్ ఫైర్
3) విరాట్ కోహ్లీ: (ఇండియా)
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ టోర్నీ అంటే అద్బుతంగా ఆడతాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం
లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కోహ్లీ తన హవా చూపిస్తున్నాడు. నాలుగు మ్యాచ్ ల్లో 72.33 సగటుతో 217
పరుగులు చేశాడు. వీటిలో పాకిస్థాన్ పై చేసిన సెంచరీతో పాటు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చేసిన 84 పరుగుల మ్యాచ్ విన్నింగ్ నాక్
ఉంది. ఫైనల్లో ఒత్తిడి తట్టుకొని నిలగడగా అడగల కోహ్లీ అత్యధిక పరుగులు చేసి గోల్డెన్ బ్యాట్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా
కనిపిస్తున్నాయి.
4)శ్రేయాస్ అయ్యర్ (ఇండియా) :
శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో మిడిల్ ఆర్డర్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. బంగ్లాతో మ్యాచ్ మినహాయిస్తే
ఆ తర్వాత జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా ఆడాడు. నాల్గు మ్యాచ్ ల్లో 48.75 యావరేజ్ తో 195 పరుగులు చేశాడు. అయ్యర్
టాప్ స్కోరర్ గా నిలవాలంటే మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ఈ నలుగురితో పాటు న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్
విలియంసన్(189), టామ్ లేతమ్ (191) రేస్ లో ఉన్నారు. అయ్యర్ తో పాటు విలియంసన్, టామ్ లేతమ్ భారీ ఇన్నింగ్స్ లు ఆడాల్సి
ఉంది.