విజయవాడ: సినిమా ప్రేక్షకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈనెల 30నుంచి ఏపీలో సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడాదిన్నరకుపైగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కరోనా మొదటి విడుత తర్వాత చాలా ఆలస్యంగా థియేటర్లకు అనుమతిచ్చినా.. గిట్టుబాటు కాదని సగానికిపైగా థియేటర్లు ఓపెన్ చేయలేదు. మళ్లీ రెండో విడుత కరోనా రావడంతో.. కాస్తో కూస్తో నడుస్తున్న థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం అనుమతిచ్చినా జీవో నెంబర్ 35 కారణంగా సీ క్లాస్ సెంటర్‌లో సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు అంటున్నారు.