
- దిశ మీటింగ్‌లో ఎంపీ చామల, ప్రభుత్వ విప్ బీర్ల, ఎమ్మెల్యే కుంభం
యాదాద్రి, వెలుగు : అభివృద్ధి పనులు చేయడంలో జాప్యమెందుకు జరుగుతోందని దిశ (జిల్లా అభివృద్ధి మరియు సమన్వయ కమిటీ) ఆఫీసర్లను ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. జాప్యం జరగడానికి గల కారణాలేమిటో చెప్పాలని డిమాండ్ నిలదీశారు. బుధవారం కలెక్టరేట్లో ఎంపీ చామల అధ్యక్షతన 'దిశ' కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్, పనుల జాప్యం గురించి ఆఫీసర్లను ఎంపీ చామల అడిగి తెలుసుకున్నారు.
కేంద్రం నుంచి వస్తున్న ఫండ్స్, వాటి ఖర్చు గురించి ఆరా తీశారు. పనుల గురించి వెంటవెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. తాము కూడా కేంద్ర మంత్రులను కలిసి స్కీమ్స్ఇంప్లిమెంటేషన్, ఫండ్స్ గురించి చర్చిస్తామని చెప్పారు. ఫండ్స్ఉన్నప్పటికీ.. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ స్కీంలో వర్క్స్ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాగా రోడ్ల నిర్మాణం ఎందుకు ఆలస్యం జరుగుతోందని ఆఫీసర్లను ప్రభుత్వ విప్బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే వాటిని క్యాన్సల్ చేసేద్దామా..? అని అడిగారు. గుండాల మండలంలో రోడ్ల నిర్మాణంలో జరగుతున్న జాప్యంపై ఆఫీసర్లను నిలదీశారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై సింగన్నగూడెం, రామకృష్ణాపురం వద్ద అండర్ పాస్ డీపీఆర్ దశలో ఉందని ఆఫీసర్లు తెలిపారు. రైల్వే ట్రాక్ పక్కనే ఉన్నందున అనంతారం వద్ద అండర్‌పాస్ సాధ్యం కాదని చెప్పారు. అదే విధంగా కొండమడుగు వద్ద అండర్ పాస్డీపీఆర్ కంప్లీట్ అయ్యిందని వివరించారు. బీబీనగర్‌లోని ఎయిమ్స్ వద్ద మూడు అండర్ పాస్‌ల డీపీఆర్ రెడీ అయిందని ఆఫీసర్లు వెల్లడించారు. అదేవిధంగా ఉపాధి హామీ స్కీమ్స్‌కు గతం కంటే ఈసారి కేంద్రం నిధులు తగ్గించిందని ఆఫీసర్లు తెలిపారు.
గత సర్కారు హయాంలో ఫండ్స్ వెనక్కి : ఎంపీ
గత సర్కారు కారణంగా సెంట్రల్గవర్నమెంట్స్ఫండ్స్ వాపస్వెళ్లాయని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్వినియోగంపై గత సర్కారు యూసీలు ఇవ్వకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. తాను మాత్రం కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ స్కీమ్‌కు ఫండ్స్ పెంపుతోపాటు డెవలప్మెంట్ వర్క్స్గురించి ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందిస్తే కేంద్ర మంత్రులను కలిసి ఫండ్స్ తీసుకొస్తానని తెలిపారు. మీటింగ్‌లో కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్కలెక్టర్వీరారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీవో నాగిరెడ్డి పాల్గొన్నారు.