చిన్నపొర్లలో శివాజీ విగ్రహావిష్కరణ

చిన్నపొర్లలో శివాజీ విగ్రహావిష్కరణ

ఊట్కూర్, వెలుగు: శివాజీ పోరాట స్ఫూర్తిని యువత గుండెల్లో నింపుకోవాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్  మండలం చిన్నపొర్లలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ రక్షణలో, హిందూ సామ్రాజ్య స్థాపనలో శివాజీ పోరాట స్ఫూర్తి గొప్పదని కొనియాడారు.

 హిందూ సంప్రదాయాలను భావి తరాలకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. దాడులు, అవమానాలు ఆగాలంటే శివాజి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అప్పాల ప్రసాద్, అలే శ్యాంకుమార్, పంచమ సిద్ద లింగస్వామి, ఆదిత్య పరాశ్రీ, శాంతానంద్  పురోహిత్, నాగురావు నామాజీ, రతంగ్  పాండురంగారెడ్డి పాల్గొన్నారు.

బీజేపీలో చేరికలు..

అడ్డాకుల: మహబూబ్​నగర్  జిల్లా మూసాపేటలో సోమవారం ఎంపీ డీకే అరుణ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్  కార్యకర్తలు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్  ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డోకూరు పవన్ కుమార్ రెడ్డి, కొండా ప్రశాంత్ రెడ్డి, భాస్కర్, చందర్​గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, భరత్ భూషణ్  పాల్గొన్నారు.