MP Gaddam Vamsikrishna: మంచిర్యాలలో వందేభారత్ హాల్ట్ ఇవ్వాలి:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

MP Gaddam Vamsikrishna: మంచిర్యాలలో వందేభారత్ హాల్ట్ ఇవ్వాలి:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ: తెలంగాణలో పలు ప్రాంతాల్లో వందే భారత్ రైళ్ల హాల్ట్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు.  అమృత్ భారత్ స్కీంలో భాగంగా మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లిలో ఒక స్టేషన్ లో హాల్టింగ్ అవకాశం ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. ఈ స్కీం కింద కేంద్ర నిధులతో ఆయా రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలన్నారు. తన విజ్ణప్తుల పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిచినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.

బడ్జెట్ సమావేశాల సందర్బంగా కొత్త  రైళ్లను ప్రవేశపెట్టి.. పెద్దపల్లి నియోజకవర్గంలో వందేభారత్ ట్రైన్ ఆపాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరగా.. ఆయన విజ్ణప్తి మేరకు  పెద్దపల్లి నియోజకవర్గంలో పలు రైళ్లకు హాల్ట్ ఇచ్చారు. దీంతో కేంద్ర రైల్వే మంత్రికి కృతజ్ణతలు తెలిపారు. అదేవిధంగా అయ్యప్ప భక్తుల కోసం శబరిమల ప్రత్యేక రైళ్ల హాల్ట్ ఇవ్వడంపై  సంతోషం వ్యక్తం చేశారు.