గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియా11వ డివిజన్ కార్పొరేటర్, టీపీసీసీ కార్యదర్శి పెద్దెల్లి తేజస్విని ప్రకాశ్ కుటుంబాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గురువారం పరామర్శించారు.
ఇటీవల ప్రకాశ్ తల్లి మధునమ్మ అనారోగ్యంతో చనిపోగా స్థానిక రాంనగర్‌లోని వారి ఇంటికి వెళ్లి మధునమ్మ ఫొటో వద్ద నివాళులర్పించారు. కార్పొరేటర్లు, లీడర్లు పి.మల్లికార్జున్, మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, గట్ల రమేశ్, రాజేశ్, బాలరాజు, తదితరులున్నారు.