మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి

మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
  • ఆర్మూర్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన

ఆర్మూర్, వెలుగు :  సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి మైలారం బాలు డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి,  అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్‌‌–1, గ్రూప్–2, గ్రూప్–3 ఫలితాలను విడుదల చేయడం ఆపాలని, మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

లేనిచో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి శ్యామ్, ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ మండల అధ్యక్షుడు మైలారం రాము, మండల ప్రధాన కార్యదర్శి నుతుపల్లి సంతోష్​, మండల కోశాధికారి మంగళారం రవి, మండల సలహాదారులు రాజ గంగారం, జిల్లా నాయకులు సంకేపల్లి విప్లవ్, ఎడపెల్లి సంతోశ్, తరుణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

పోతంగళ్‌లో ఎమ్మార్పీఎస్​ దీక్షలు 

కోటగిరి, వెలుగు :  ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం పోతంగల్  మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్​ నాయకులు నిరవధిక దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్​ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి  సోంపూర్ పోచీరామ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర సర్కార్​ నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదవరావు, ఉపాధ్యక్షుడు సాయిలు, ప్రధాన కార్యదర్శి సంగయ్య, సహాయ కార్యదర్శి లాలయ్య, కార్యదర్శి వెంకటి, సలహాదారుడు బాలయ్య, గౌరవాధ్యక్షులు నేరెళ్ల వీరయ్య, జెండా గంగారం తదితరులు పాల్గొన్నారు.